తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్​ విప్​ - agriculture

రైతు సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​ తెలిపారు. వరంగల్​ పట్టణ జిల్లా పలివేల్పులలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్​తో కలిసి ఆయన రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Government Chief Whip laid foundation for the farmer's platform in warangal rural district
రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్​ విప్​

By

Published : Aug 28, 2020, 3:27 PM IST

రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్​ విప్ వినయ్​భాస్కర్ అన్నారు. వరంగల్ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం పలివేల్పులలో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్​తో కలిసి ఆయన రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రైతును సంఘటిత శక్తిగా మార్చిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని చీఫ్​ విప్ వినయ్​భాస్కర్ అన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశ పెడుతుందన్నారు. రైతు వేదికలను దసరా వరకు పూర్తి చేస్తామని చెప్పారు.

ఇవీ చూడండి: నీటమునిగిన వరి, పత్తి పంటలు.. అన్నదాతల అగచాట్లు

ABOUT THE AUTHOR

...view details