జిల్లాల పర్యటనలో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వరంగల్‌కు చేరుకున్నారు. గవర్నర్‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాఠోడ్ స్వాగతం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
హన్మకొండకు చేరుకున్న తమిళిసై - తమిళిసై తాజా వార్త
యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై వరంగల్ జిల్లాలోని హన్మకొండకు చేరుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్, మంత్రి సత్యవతి రాఠోడ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు.
హన్మకొండకు చేరుకున్న తమిళిసై
ఉదయం యాదాద్రీశుడిని దర్శించుకున్న గవర్నర్... అక్కడి నుంచి వరంగల్‌కు వెళ్లారు. కార్యక్రమం వేయి స్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి ఆలయం సహా వరంగల్ కోటను సందర్శించనున్నారు.
ఇదీ చూడండి: గవర్నర్ వరంగల్ పర్యటన ఖరారు