భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం బాలా త్రిపురసుందరి అలంకరణలో అందంగా అలంకరించారు.
బాలాత్రిపుర సుందరిగా కొలువుదీరిన భద్రకాళీ అమ్మవారు
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మొదటి రోజున అర్చకులు.. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
బాలాత్రిపుర సుందరిగా కొలువుదీరిన భద్రకాళీ అమ్మవారు
బాలాత్రిపుర సుందరి అవతారంలో కొలువు దీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల భౌతిక దూరం కనుమరుగైందని భక్తులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని చెప్పినా.. అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.