వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. జన్మాష్టమిని పురస్కరించుకుని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుణ్ణి శ్రీ కృష్ణుని అవతారంలో ఆలయ అర్చకులు అలంకరించారు.
వేయిస్తంభాల ఆలయంలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు - god decorated as lord krishna with 51 kilo curd rice at thousand pillar temple
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేయి స్తంభాల ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయంలోని రుద్రేశ్వరస్వామిని 51 కిలోల పెరుగు అన్నం, మందార పువ్వులతో కృష్ణుడి రూపంలో అందంగా అలంకరించారు.
వేయిస్తంభాల ఆలయంలో ఘనంగా జన్మాష్టమి వేడుకలు
ఆలయ అర్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో 51 కిలోల పెరుగు అన్నం, మందార పువ్వులతో స్వామిని కృష్ణుడి రూపంలో అలంకరించారు. కృష్ణావతారంలో ఉన్న రుద్రేశ్వరుణ్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో మునిగితేలారు.
ఇదీ చూడండి:హైదరాబాద్కు 200 టన్నుల అమోనియం నైట్రేట్!
TAGGED:
sri krishnastami vedukalu