లాక్డౌన్ నేపథ్యంలో గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై వరంగల్ పోలీసులు కొరడా ఝులపిస్తున్నారు. పోలీసులు బందోబస్తులో బిజీగా ఉంటే... కొందరు అక్రమార్కులు కూరగాయల మధ్యలో అంబర్ ప్యాకెట్లను పెట్టి తరలిస్తున్నారు.
నిషేధిత అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్
లాక్డౌన్ సమయంలో కూరగాయల మధ్యలో అంబర్ ప్యాకెట్లు పెట్టి తరిలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను వరంగర్ అర్బన్ జిల్లా హసన్ పర్తి పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
నిషేధిత అంబర్ ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి సమీపంలో 2 ట్రాలీ ఆటోలు వస్తుండగా... అనుమానం వచ్చి పోలీసులు తనిఖీలు చేశారు. అందులో నిషేధిత అంబర్ ప్యాకెట్లు ఉండగా... పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేపట్టి ఆరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 35 వేలు విలువ చేసే అంబర్ ప్యాకెట్లు, 2 ట్రాలీ ఆటోలు, గుట్కాలను కొనుగోలు చేసేందుకు తీసుకెళుతున్న 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో ఒక్క రోజులోనే 20 కేసులు