Fake Seeds Selling Gang arrested in Warangal : రైతుల ఆశలను సొమ్ము చేసుకోవాలని కొందరు నకిలీ విత్తనాలను మార్కెట్లో అమ్ముతున్నారు. ఇప్పుడు రైతులంతా వానాకాలం పంట పనులు మొదలు పెడుతున్న సమయంలోో విత్తనాలకు డిమాండ్ ఉంటుందని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ విత్తనాలు తయారు చేసే 15 మంది సభ్యుల రెండు ముఠాలను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.2.5 కోట్లకు పైగా విలువ చేసే నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. విత్తనాలను సరఫరా చేసే డీసీఎం, కారుతో పాటు నకిలీ విత్తనాల తయారీ యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వానాకాలం సాగుకు రైతులు సన్నద్ధమైన తరుణంలో నకిలీ విత్తన విక్రయదారులు జోరు పెంచుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి అన్నదాతలను మోసం చేసి నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. విత్తనాలు నకిలీవని తెలియక వాటిని కొనుగోలు చేసి రైతులు నిండా మునుగుతున్నారు. పంట ఎదుగుదల లేక దిగుబడి రాక నష్టాలపాలవుతున్నారు.
Arrest of a gang selling non-scientific seeds : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలకు చెందిన 15 మందిని తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.2.5 కోట్లకు పైగా విలువైన 12 టన్నుల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు . 9765 నకిలీ విత్తన ప్యాకెట్లు, ఒక డీసీఎం, కారు, రూ.21 లక్షల నగదు, విత్తనాలను తయారు చేసేందుకు అవసరమమైన యంత్రాలను, సామగ్రినీ స్వాధీనపర్చుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్సు, మడికొండ, ఎనుమాముల పోలీసులు కలిసి ఈ ముఠా గుట్టు రట్టు చేశారు.