తెలంగాణ

telangana

ETV Bharat / state

'గణేశ్ నిమజ్జనంలో మాస్కులు ధరించాలి, భౌతికదూరం పాటించాలి' - వరంగల్ డీసీపీ పుష్ప వార్తలు

వరంగల్‌లో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను డీసీపీ పుష్ప పర్యవేక్షించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించే ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. నీటిపారుదల శాఖ, పోలీస్, రెవెన్యూ, వరంగల్ మహానగర పాలక సంస్థ సమన్వయంగా ఏర్పాట్లను పూర్తిచేశారు.

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన డీసీపీ పుష్ప
గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించిన డీసీపీ పుష్ప

By

Published : Aug 31, 2020, 5:28 PM IST

వరంగల్‌లో గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను డీసీపీ పుష్ప పర్యవేక్షించారు. నగరంలోని చిన్న వడ్డేపల్లి చెరువు వద్ద పరిశీలించిన తర్వాత కరీమాబాద్, రంగసముద్రం వద్ద ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించే ఈ విధంగా చర్యలు తీసుకున్నారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. నీటిపారుదల శాఖ, పోలీస్, రెవెన్యూ, వరంగల్ మహానగర పాలక సంస్థ సమన్వయంగా ఏర్పాట్లను పూర్తిచేశారు.

నగరంలో మొత్తం ఐదు వందల పైచిలుకు పెద్ద గణపతులు ఉన్నట్లు గుర్తించామని.. అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కొవిడ్ కారణంగా నగరంలో గణనాథుల మండపాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు తెలిపారు. నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:'కొవాగ్జిన్'​ రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details