వరంగల్ జిల్లా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్లో ఓ చెట్టుపై రెండు వందలకు పైగా గబ్బిలాలు కనువిందు చేశాయి. రోజురోజుకు అంతరించిపోతున్న గబ్బిలాలను చూసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరిచారు. వాటి వల్ల మనుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని... మూఢనమ్మకాల పేరుతో మనుషులు వాటి స్థావరాలపై దాడి చేస్తున్నారని కాకతీయ విశ్వ విద్యాలయం జంతుశాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ తెలిపారు. గబ్బిలాలు రాత్రి పూట మనుషులకు హాని కలిగించే కీటకాలను తిని మానవాళికి ఉపయోగపడతాయని అన్నారు.
వరంగల్లో కనువిందు చేసిన గబ్బిలాలు - gabbilalu
అంతరించిపోతున్న గబ్బిలాలు హన్మకొండలో కనువిందు చేశాయి. దాదాపు రెండు వందలకు పైగా గబ్బిలాలను చూసేందుకు నగరవాసులు తరలివచ్చారు.
చెట్టుపై కనువిందు చేస్తున్న గబ్బిలాలు