వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మొక్క జొన్నలు పోటెత్తాయి. మార్కెట్లోని యార్డు మొత్తం మొక్కజొన్నలతో నిండిపోయి.. మార్కెట్ కళకళలాడుతోంది. వరుస సెలవుల అనంతరం తెరుచుకున్న మార్కెట్ యార్డుకు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రైతులు మొక్కజొన్నలను తీసుకువచ్చారు. ఇంటి వద్ద స్థలం లేకపోవడం వల్ల పెద్ద ఎత్తున్న అన్నదాతలు మార్కెట్‌కి వచ్చి మొక్కజొన్నలను ఆరబెట్టారు.
మక్కలతో కళకళలాడిపోతున్న ఎనుమాముల మార్కెట్
వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్నలతో కళకళలాడిపోతోంది. యార్డులో ఎటు చూసినా మక్కలే దర్శనమిస్తున్నాయి.
మక్కలతో కళకళలాడిపోతున్న ఎనుమాముల మార్కెట్
TAGGED:
ఎనుమాముల మార్కెట్