లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన స్వచ్ఛంద సంస్థ పేదలకు కూరగాయల వితరణ చేపట్టారు. పాలు, గుడ్లను సైతం పంపిణీ చేశారు. ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద సంఖ్యలో కేంద్రం వద్ద బారులు తీరారు.
వరంగల్లో ఉచిత కూరగాయల పంపిణీలో రసాభాస - FREE VEGETABLES DISTRIBUTION IN WARANGAL BYAN NGO
లాక్ డౌన్ నేపథ్యంలో వరంగల్ నగరంలోని కాశిబుగ్గకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ పేదలకు కూరగాయలను పంపిణీ చేసింది. సామాజిక దూరం పాటించకపోవడం వల్ల పోలీసులు కలగజేసుకున్నారు. అనంతరం వారిని చెదరగొట్టగా కార్యక్రమం రసాభాసగా మారింది.
సామాజిక దూరం పాటిస్తూ కూరగాయలు పంపిణీ చేయాలి : పోలీసులు
సామాజిక దూరం పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందని పోలీసులు స్థానికులను చెదరగొట్టారు. వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకున్న అనంతరమే పంపిణీ చేపట్టాలని నిర్వాహకులకు పోలీసులు స్పష్టం చేశారు.
TAGGED:
Vegtables Pampini Rasabasa