ఉమ్మడి వరంగల్ జిల్లా మేరుసంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తోన్న అన్ని సంఘాలు, స్వచ్ఛంద సంస్థల వ్యక్తులను ఆయన అభినందించారు.
మాస్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి - వరంగల్ జిల్లా
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేరు సంఘం ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. నిరుపేదలను ఆదుకోవడానికి దాతలకు ఇదే సమయమని ప్రతి ఒక్కరు తమకు తోచిన సాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మాస్కులు పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి
స్వచ్ఛంద సంస్థలకు ఇది సరైన సమయమని.. దాతలు నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు రావాలని ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ప్రజలు కరోనా వైరస్ పట్ల అవగాహన కలిగి ఉండి తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్కుల పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:తగ్గుతున్న వాయుకాలుష్యం.. తేటపడుతున్న నగరాలు