వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతి - బావిలో పడి నలుగురు వలస కార్మికులు మృతి
![వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతి four-migrants-dead-drowning-in-a-well-in-warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7292234-424-7292234-1590068543997.jpg)
17:26 May 21
వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతి
వరంగల్ అర్బన్ జిల్లా గొర్రెకుంట శివారులో గన్నీ సంచి గోదాములోని పాత పాడుబడ్డ బావిలో అనుమానస్పద స్థితిలో నాలుగు మృత దేహాలు బయటపడ్డాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు. మృతులు పశ్చిమ్ బంగకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా గత 20 ఏళ్లు నుంచి వలసకార్మికులుగా వరంగల్‌లోని శివనగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నారు.
లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని రోజులుగా గోదాములోని ఒక రూంలో జీవనం సాగిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక చిన్నారి ఉంది. మరో ఇద్దరి జాడ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బల్దియా సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికి తీశారు. శవపరీక్షల నిమిత్తం మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు.
ఇదీ చూడండి :దుబాయ్‌లో మనోడికి జాక్‌పాట్.. లాటరీతో కోట్లు కైవసం