తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​ తర్వాత వరంగల్​పైనే సీఎం శ్రద్ధ' - వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వార్తలు

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ దయాకర్​, వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ శంకుస్థాపన చేశారు. నగరంలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు.

hanmakonda,warangal urban district, foundation stones in warangal
హన్మకొండ, అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన

By

Published : Jan 22, 2021, 12:42 PM IST

హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని ప్రభుత్వ ఛీప్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ పేర్కొన్నారు. అందుకే ప్రతి సంవత్సరం రూ. 300 కోట్ల నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. హన్మకొండలో పలు అభివృద్ధి పనులకు ఎంపీ పసునూరి దయాకర్​, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. నగరంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని వివరించారు.

ఇదీ చదవండి:పేదల చెంతకే మెరుగైన ఉచిత వైద్యం: మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details