గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై హన్మకొండలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి, మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నేతలతో మంతనాలు జరిపారు. తెరాస నాయకుల మాయమాటలకు ఎవరు అమ్ముడు పోవద్దని కొండా సురేఖ సూచించారు.
డబ్బున్నోళ్లే టికెట్ అడగాలి: కొండా సురేఖ - గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ తాజా వార్తలు
డబ్బు ఉన్నవారే టికెట్ అడగాలని మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై హన్మకొండలోని తన నివాసంలో తన భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళితో కలిసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నేతలతో మంతనాలు జరిపారు.
కొండా సురేఖ
ఎన్నికల్లో డబ్బే ప్రధానం కాబట్టి కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేయడానికి వచ్చే అభ్యర్థులు ఆర్థికంగా ఉన్నవారై ఉండాలన్నారు. మీరు కొంత డబ్బులు పెడితే మేము కొంత డబ్బులు పెట్టి గెలిపిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకొని ఎవ్వరూ అమ్ముడుపోవద్దని సూచించారు.
ఇదీ చదవండి:వారాంతంలో స్వల్ప లాభాలు-14,600 పైకి నిఫ్టీ