వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో అటవీ శాఖ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సారసాలలో అటవీశాఖ క్షేత్రాధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ హన్మకొండలోని జిల్లా అటవీశాఖ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లారు. అటవీ సంపదను కాపాడుతున్న సిబ్బందిపైనే దాడికి పాల్పడటం హేయమైన చర్య అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ - అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సారసాలలో అటవీశాఖ అధికారిపై జరిగిన దాడిని నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో అటవీశాఖ ఉద్యోగులు సంఘీభావ ర్యాలీ చేపట్టారు.

అటవీశాఖ ఉద్యోగుల సంఘీభావ ర్యాలీ