లాక్డౌన్ నేపథ్యంలో వరంగల్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న వలసకూలీలు, అనాథలకు అయ్యప్ప సేవా సమితి సభ్యులు అన్నదానం చేస్తూ సేవాగుణాన్ని చాటుకుంటున్నారు. ఉర్సు నాగమయ్య కుటీరానికి చెందిన అయ్యప్ప భక్తులు.. అయ్యప్ప సేవా సమితి పేరిట నగరంలోని అభాగ్యులకు ఆసరాగా నిలుస్తున్నారు.
అన్నార్థుల ఆకలి తీర్చుతున్న అయ్యప్ప సేవా సమితి - అన్నదానం
ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు వలస కూలీలకు వరంగల్ నగరంలోని అయ్యప్ప సేవాసమితి సభ్యులు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. రోజుకు 300 మంది అన్నార్థుల ఆకలిని తీర్చుతూ అందరి మన్ననలను పొందుతున్నారు.
అన్నార్థుల ఆకలి తీర్చుతున్న అయ్యప్ప సేవా సమితి
15 మందితో కూడిన బృందం రోజూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి తిండిలేక ఇబ్బంది పడుతున్న, పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి దాతల సాయంతో రోజుకు 300 మందికి ఆహారపొట్లాలను వితరణ చేస్తున్నారు. అలాగే కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రజలకు అవగాహ కల్పిస్తున్నారు. కష్టకాలంలో ఆకలి తీరుస్తున్న అయ్యప్ప సేవా సమితి సభ్యుల కృషిని పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి:25 సెకన్లలో శరీరంపై ఉన్న క్రిములన్నీ కడిగేస్తుంది!