వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జిల్లా పర్యాటక శాఖ, హరిత యోగ నిర్వాహకులు పోశాల శ్రీనివాస్ సంయుక్త ఆధ్వర్యంలో యోగ సాధకులు నిత్యం వందలాది మందికి అన్నం, అల్పాహారం పెడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న అన్నార్తులకు హరితయోగ గురువు శ్రీనివాస్, యోగ సాధకులు అండగా నిలుస్తున్నారు.
అన్నార్తుల ఆకలి తీరుస్తోన్న హరితయోగ నిర్వాహకులు - హన్మకొండలో ఫుడ్ పంపిణీ
కరోనా విపత్తు వేళ మానవత్వం పరిమళిస్తోంది. ఓరుగల్లులో పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కొవిడ్ బాధితులు, నిరుపేదలకు అన్నం పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నారు. ఏ మాత్రం భయపడకుండా కరోనా బాధితుల ఇంటికి వెళ్లి ఆహార పొట్లాలను అందిస్తున్నారు.
food
రోజూ నిరుపేదలకు ఆకలి తీర్చడమే కాకుండా కరోనా బాధితుల ఇంటికి వెళ్లి వారికి ఆహారాన్ని అందిస్తున్నారు. యోగ సాధకుల సహాయంతో ఆహారం వండి పొట్లాలు కట్టి వారికి ఇస్తున్నారు.