జానపద కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వరంగల్ నగరంలో సకల కళా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో పలువురు కళాకారులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను వెంటనే గుర్తించాలని కోరారు. అర్హులైన కళాకారులందరికీ రెండు పడక గదుల ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా కళాకారులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలి' - telangana varthalu]
రాష్ట్ర ప్రభుత్వం జానపద కళాకారులను గుర్తించి వారికి బతుకుదెరువు కల్పించాలని వరంగల్లో పలువురు కళాకారులు ధర్నా చేపట్టారు. అర్హులైన కళాకారులందరికీ రెండు పడక గదుల ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
'రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలి'
కళాకారులకు బతుకుదెరువు కల్పించి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఐదు వేల మంది కళాకారులు ఉన్నారని.. తెలంగాణ సంస్కృతి సారధి ద్వారా కేవలం 500 మందికి ఉపాధి కల్పించారని... మిగిలిన వారిని ఎలాంటి ఉపాధి లేకపోవడం వల్ల బతుకు భారం అవుతోందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: వైరస్ వస్తే శవాల గుట్టలే ఉంటాయని అందరం భయపడ్డాం: ఈటల