తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈదురు గాలుల బీభత్సం... వ్యక్తి దుర్మరణం - ఈదురు గాలుల బీభత్సం... వ్యక్తి దుర్మరణం

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నిన్న రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ గాలుల ధాటికి రేకులు మీద పడటం వల్ల ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. కుటుంబసభ్యులు విషాదంలో మునిపోయారు.

Flakes  hit the man and dies in Warangal urban district
ఈదురు గాలుల బీభత్సం... వ్యక్తి దుర్మరణం

By

Published : May 19, 2020, 1:13 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రలో నిన్న రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల ధాటికి రేకులు మీద పడి జయశంకర్​ భూపాలపల్లి జిల్లా తిరుమలగిరికి చెందిన రావుల విద్యాసాగర్​ అనే వ్యక్తి మృతి చెందాడు. పని నిమిత్తం భార్యతో కలిసి హన్మకొండకు వచ్చారు. అయితే నిన్న రాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు రోడ్డు పక్కన ఉన్న రేకుల షెడ్డు కిందకు వెళ్లారు.

గాలుల ధాటికి రేకులు మీద పడటం వల్ల విద్యా సాగర్​కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మరణించారు. కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details