Warangal NIT Corona Cases: వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ- నిట్‌లో కరోనా కలకలం రేగింది. కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల క్రిస్మస్ వేడుకలకు ఇంటికెళ్లి వచ్చిన 200 మంది విద్యార్థులకు నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో... నలుగురు విద్యార్థులు, అధ్యాపక బృందంలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.
వరంగల్ నిట్‌లో కరోనా కలకలం.. ప్రత్యక్ష తరగతులు నిలిపివేత
Warangal NIT Corona Cases: వరంగల్ నిట్‌లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు. 200 మంది విద్యార్థులు, అధ్యాపక బృందానికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా... నలుగురు విద్యార్థులు, ఆధ్యాపక బృందంలో ఒకరికి పాజిటివ్‌గా తేలింది. కేసులు నిర్ధారణ కావడంతో వెంటనే ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు.
వరంగల్ నిట్‌లో కరోనా కలకలం
కరోనా కేసులు వెలుగుచూడటంతో వెంటనే ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారందరిని క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. ఈ నెల 16 వరకు... విద్యార్థులకు ఆన్‌లైన్ బోధన అందిస్తామని నిట్ డైరెక్టర్ ఎన్.వి రమణారావు పేర్కొన్నారు. క్యాంపస్‌లో ఉండే మిగతా ఉద్యోగులందరికీ పరీక్షలు చేయించనున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి:Covid cases in India: దేశంపై కరోనా పంజా- కొత్తగా 1.17 లక్షల మందికి వైరస్