వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలోని పెద్దచెరువు మత్తడి పోస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పాల నురగలా పైనుంచి జాలువారుతున్న నీటిప్రవాహాన్ని చూసేందుకు చుట్టు పక్కలవారు బారులు తీరుతున్నారు. చిన్నాపెద్దా అంతా చేరి నీటిలో కేరింతలు కొడుతున్నారు. మహిళలు చీర కొంగుతో చేపలు పడుతూ మురిసిపోతున్నారు.
మత్తడి పోస్తున్న వాగులు.. ఆనందంలో మత్స్యకారులు - ponds overflown in kazipet
వారం రోజులుగా కురుస్తున్న వానకు రాష్ట్రంలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. పలు ప్రాంతాల్లో పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం మడికొండలోని పెద్దచెరువు మత్తడి పోస్తూ మనోహరంగా కనువిందు చేస్తోంది.
వరంగల్ అర్బన్ జిల్లాలో మత్తడి పోస్తున్న వాగులు..
అలుగుతో పాటు పై నుంచి కిందకు దూకుతున్న చేపలను మత్స్యకారులు వలలో ఒడిసిపడుతున్నారు. ఒక్కో చేప ఐదు నుంచి ఆరు కిలోల బరువు తూగుతుండటం వల్ల జాలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు జిల్లాలోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారి అలుగు పారుతుండటం వల్ల చేపలు పట్టడం సులువవుతోందని మత్స్యకారులు ఆనంద పడుతున్నారు.
- ఇదీ చూడండి :ఎడతెరిపి లేని వర్షాలు... జలమయమవుతున్న జిల్లాలు
TAGGED:
కాజీపేట్‌లో పెద్దచెరువు