తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓ ప్రముఖ బట్టల దుకాణంలో మంటలు - వరంగల్​ పట్టణ జిల్లా తాజా వార్తలు

హన్మకొండ బస్టాండ్ రోడ్​లోని ఓ ప్రముఖ బట్టల దుకాణంలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన సిబ్బంది అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Fires in cloth store at hanamkonda
ఓ ప్రముఖ బట్టల దుకాణంలో మంటలు

By

Published : May 11, 2020, 2:50 PM IST

వరంగల్​ పట్టణ జిల్లా హన్మకొండ బస్టాండ్ రోడ్​లోని ఓ ప్రముఖ బట్టల దుకాణంలో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన అగ్నిమాపక అధికారులు స్కై లిఫ్ట్ వాహనం ద్వారా భవనంలోకి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం షాపింగ్​మాల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం లోపలికి వెళ్లేందుకు సిబ్బంది ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. చివరకు గోడలు పాక్షికంగా బద్దలు కొట్టి మంటలను నియంత్రించారు.

ఇన్నాళ్లూ మూసి ఉంచిన మాల్​ను నిన్న ఉదయం సిబ్బంది శుభ్రం చేసేందుకు తెరిచారు. తెరిచిన కాసేపటికే మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించి అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఇదీ చూడండి :సిరిసిల్లలో మంత్రి కేటీఆర్​ పర్యటన

ABOUT THE AUTHOR

...view details