నిట్‌లోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు - వరంగల్ అర్బన్ జిల్లా వార్తలు
వరంగల్ నిట్‌లో వసతిగృహం వెనుక వైపు ఉన్న డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. రెండు యంత్రాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఎండ వేడిమి కారణంగానే మంటలు వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు.
![నిట్‌లోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు Fire in nit dumping yard](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-07:13-tg-wgl-12-20-fire-in-nit-dumping-yard-av-ts10132-20052020165709-2005f-1589974029-118.jpg)
వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్ లోని వసతిగృహం వెనకవైపు ఉన్న డంపింగ్ యార్డ్ లో మంటలు చెలరేగాయి. క్యాంపస్, వసతిగృహల్లోని చెత్త చెదారాలను ఈ డంపింగ్ యార్డ్ లో వేస్తుంటారు. దాని నుంచి మంటలు చెలరేగి... పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక యంత్రాల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎండవేడిమి కారణంగానే చెత్తకుప్పల్లో మంటలు చెలరేగి ఉంటాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. నిట్ భవన సముదాయాలకు డంపింగ్ యార్డ్ దూరంగా ఉండడం వల్ల ఎటువంటి నష్టం సంభవించలేదు. చెత్తకుప్పల నుంచి పొగలను గమనించిన నిట్ సిబ్బంది అప్రమత్తమవడం వల్ల మంటలు ఎక్కువగా వ్యాపించకుండా అరికట్టగలిగారు.