వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాపులోని మూడంతస్తుల గదిలో దట్టమైన పొగలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లాక్డౌన్ నేపథ్యంలో 40 రోజులు తర్వాత షాప్లో విద్యుత్తు ఆన్ చేయగా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. వైర్లను ఎలుకలు కొరకడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని యాజమాని లక్ష్మన్‌దాస్ తెలిపారు. సకాలంలో ఫైరింజన్‌లు చేరుకుని మంటలు పక్క షాపులకు వ్యాపించకుండా చేశారు. దట్టమైన పొగలు వ్యాపించి లోపలికి వెళ్లలేని స్థితి నెలకొంది.
షాపింగ్మాల్లో అగ్నిప్రమాదం - వరంగల్లోని వస్త్ర దుకాణంలోఅగ్నిప్రమాదం
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
షాపింగ్మాల్లో అగ్నిప్రమాదం