వరంగల్లోని మినీ డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోతననగర్లోని మినీ డంపింగ్ యార్డులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
వరంగల్ మినీ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం - డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం
డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం జరిగిన ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు.

వరంగల్ మినీ డంపింగ్ యార్డులో అగ్నిప్రమాదం
ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు బల్దియా సిబ్బందిని విచారించారు. గతంలో ఇదే డంపింగ్ యార్డులో స్వల్ప అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బల్దియా అధికారులు ఇక్కడ మినీ డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన నాటి నుంచి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
ఇదీ చదవండి:చోరీని అడ్డుకోబోయిన యువకుడిపై కత్తితో దాడి