మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర హుండీల లెక్కింపు తుది దశకు చేరుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈనెల 12 నుంచి జాతరలో ఏర్పాటు చేసిన 494 హుండీలను తెరిచి లెక్కిస్తున్నారు. నోట్ల లెక్కింపు పూర్తి కాగా చిల్లర నాణేలను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు మేడారం హుండీల ఆదాయం రూ.11, 17, 99, 885 ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
తుదిదశకు చేరుకున్న సమ్మక్క- సారలమ్మ హుండీల లెక్కింపు - మేడారం జాతర హుండీల లెక్కింపు
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈనెల 12 నుంచి జాతరలో ఏర్పాటు చేసిన 494 హుండీలను తెరిచి లెక్కిస్తున్నారు.
తుదిదశకు చేరుకున్న సమ్మక్క- సారలమ్మ హుండీల లెక్కింపు
గతంలో మేడారం హుండీల ఆదాయం రూ. 10 కోట్లు రాగా ఈసారి రూ. 12 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లులకు సమర్పించిన ఒడి బియ్యం జల్లెడ పట్టి అందులో ఉన్న నాణేలను వేరు చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజులలో మొత్తం లెక్కింపు పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు.