యూజీ ఆయుష్ కన్వీనర్ కోటాలోని సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్ కళాశాలల్లోని ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
ఆయుష్ కన్వీనర్ కోటా సీట్లకు ఆఖరు విడత ప్రవేశాలు - కాళోజీ నోటిఫికేషన్ న్యూస్
యూజీ ఆయుష్ కన్వీనర్ కోటాలోని సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది.
ఆయుష్ కన్వీనర్ కోటా సీట్లకు ఆఖరు విడత ప్రవేశాలు
ఇవాళ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గత విడతలో సీటు వచ్చినా... కళాశాలలో చేరని అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు.