దేశవ్యాప్త సమ్మెలో భాగంగా.. నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో రైతు సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలు వామపక్ష పార్టీలతో కలిసి.. రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం కూడలి వరకు నేతలు ర్యాలీ నిర్వహించారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం: రైతు సంఘాలు
కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.. రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. వరంగల్‌లో.. రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించాయి.
పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం: రైతు సంఘాలు
దిల్లీలో.. నాలుగు నెలలుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే, కేంద్రం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాలను రద్దు చేయకపోతే.. పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా?: షర్మిల