కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరంగల్ నగరంలో రైతు సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. గత 75 రోజులుగా కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. దిల్లీలో రైతులు ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని తెలిపారు. రైతు సంఘాల పిలుపు మేరకు ఏఐకేఎస్‌సీసీ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ ఎదుట రైతు సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
రైల్వే స్టేషన్ ఎదుట రైతు సంఘాల నాయకుల ధర్నా
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘం నాయకులు వరంగల్ నగరంలో నిరసన చేశారు. రైల్వే స్టేషన్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తన వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైల్వే స్టేషన్ ఎదుట రైతు సంఘాల నాయకుల ధర్నా
ధర్నాకు దిగిన రైతు సంఘం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకువచ్చిన బిల్లులను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నూతన బిల్లుతో ప్రభుత్వ సంస్థలు నిర్వీర్యం కావడంతో వాటిపై ఆధారపడిన సుమారు లక్ష మంది కార్మికులు రోడ్డున పడతారని రైతు సంఘం నాయకులు వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి :న్యాయం కోసం రోడ్డెక్కిన న్యాయవాదులు