తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీళ్ల లేక పంటలు ఎండిపోతున్నాయ్... ఆదుకోండి సార్' - వరంగల్ అర్బన్ వార్తలు

వరంగల్ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లిలోని మాణిక్యపూర్​ గ్రామంలో సాగునీటి కోసం రైతులు రోడెక్కారు. ఫిబ్రవరిలో ధర్మసాగర్​ చెరువు నీటిని వదిలినా, కెనాల్​కు చివరిలో ఉన్న తమ గ్రామాలకు చుక్క నీరు కూడా అందలేదని రైతులు వాపోయారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

farmers protest for water at warangal urban
'నీళ్ల లేక పంటలు ఎండిపోతున్నాయ్... కాపాడండి సార్'

By

Published : Apr 6, 2021, 6:41 PM IST

నాట్లు వేసినప్పుడు ఉన్న బోర్లు, బావుల్లో నీరు ఉన్నాయ్ సార్... పంట చేతికి వస్తుంది అనుకున్న సమయంలో చుక్క నీరు కూడా మిగల్లేదు. సరిపడ నీళ్లు లేక పంట ఎండిపోయి... పశువులకు మేత అవుతోంది. దాయాదులు ప్రాజెక్టు నుంచి కొంచెం నీరు వదలి పంటను కాపాడండి సార్... లేకుంటే మాకు చావే శరణ్యం.

మాణిక్యపూర్ గ్రామస్థుల ఆవేదన

పంటలకు సరిపడా సాగునీరులేక పంటలు ఎండిపోతున్నాయని... దేవాదుల ప్రాజెక్టు నుంచి నీరు అందించాలని మాణిక్యపూర్ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలంటూ హుజూరాబాద్-ముల్కనూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కెనాల్​కు ఇప్పటికే సగం పంటలు ఎండిపోయాయని... మిగిలిన వాటినైనా కాపాడుకోవడానికి నీరు అందించాలని కోరారు. వరి నాట్లు వేసే సమయంలో బావుల్లో, బోర్లలో నీరు సమృద్ధిగా ఉండగా... పంట చేతికందే సమయంలో నీరు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశామని... ఇప్పుడు పంటలు ఎండిపోతుండడంతో పశువులకు మేతగా వేయాల్సి వస్తోందని తెలిపారు. పంటలు ఎండిపోయి... నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

పశువులకు మేతగా..

ఇదీ చూడండి:భూమిలో పాతిపెట్టిన టిఫిన్ బాక్స్‌.. తెరిస్తే ఏముందంటే..

ABOUT THE AUTHOR

...view details