తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers: ప్రాణాలు పోయినా భూములిచ్చేదని లేదంటున్న రైతులు - ల్యాండ్‌ పూలింగ్‌

డిజిటల్‌ సర్వే పేరిట భూముల వివరాలు సేకరించి ఇప్పుడు ల్యాండ్‌ పూలింగ్‌ అంటూ తమ జీవనాధారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారంటూ... హనుమకొండ జిల్లాలో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా తమ సాగు భూములిచ్చేదని లేదని తెగేసి చెబుతున్నారు.

farmers protest for land pooling in hanmakonda
farmers protest for land pooling in hanmakonda

By

Published : Aug 24, 2021, 5:08 AM IST

అన్నదాతకు ప్రాణం కన్నా విలువైనది భూమి. సాగు లాభసాటిగా సాగినా.....నష్టాలు మూటగట్టినా.... ప్రకృతి ప్రకోపం చూపించినా.... నేలనే నమ్ముకొని జీవనం సాగిస్తాడు. అలాంటిది ఏటా రెండు పంటలు పండించే త భూమిని అక్రమంగా లాక్కుంటున్నారంటూ..... హనుమకొండ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగుతున్నారు. హసన్‌పర్తి మండలం ఆరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట కర్షకులు భూములను కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. ప్రాణలు అడ్డువేసైనా భూములను కాపాడుకుంటామని స్పష్టం చేస్తున్నారు.

వరంగల్ ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో కాకతీయ పట్టణాభివృద్ది సంస్థ టౌన్ షిప్ ఏర్పాటు చేసి ఆ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు చేయాలని సంకల్పించడమే.. అన్నదాతల ఆగ్రహానికి కారణమైంది. ఓ ప్రైవేట్‌ఏజెన్సీతో 1600 ఎకరాలకు పైగా కాకతీయ పట్టణాభివృద్ది సంస్ధ సర్వే చేయించింది. రోడ్లు, డిజిటల్‌ సర్వే అని చెప్పి వివరాలు తీసుకున్నారని చెబుతున్న రైతులు.. ఇప్పుడు ల్యాండ్‌ బ్యాంకు అంటూ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మూడు రోజుల క్రితం.... కొత్తపేట దామెర క్రాస్ రోడ్డు వద్ద 163 జాతీయ రహదారిపై 500 మంది రైతులు రాస్తోరోకో చేశారు. రాఖీ పండుగ రోజు భూముల్లో పంటకు రాఖీ కట్టి.. భూమిపై తమకు గల మక్కువ చాటుకున్నారు. భూమిని లాక్కొని తమ పొట్టగొట్టవద్దని వేడుకుంటున్నారు.

హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టరేట్ల వద్ద రైతులు తమ గోడు వినిపించుకున్నారు. తరతరాలనుంచి భూమినే నమ్ముకుంటూ బతుకుతున్నామని...దానిని లాక్కొని తమను రోడ్డున పడేయవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. సర్వే చేసే అధికారులను అడ్డుకుంటే... కేసులు పెడుతున్నారని వాపోయారు. భూములనిచ్చే ఇచ్చే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పారు.

పూర్తిస్థాయిలో పరిశీలన చేసి న్యాయం చేస్తామని రైతులకు అధికారులు హామీ ఇచ్చారు. ప్రాణాలు పోయినా భూములు వదులుకోబోమని అన్నదాతలు స్పష్టంచేస్తున్నారు

ఇదీ చూడండి:

CM KCR: అంగన్వాడీ కేంద్రాలు సహా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల పునఃప్రారంభం

ABOUT THE AUTHOR

...view details