వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో రైతన్నలు వాటర్ ట్యాంక్ పైకి నిరసన తెలియజేశారు. తమ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 40 మంది రైతులు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పైకి ఆందోళన నిర్వహించారు.
పాసుపుస్తకాల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు - వరంగల్ అర్బన్ జిల్లా సమాచారం
తమ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదంటూ రైతన్నలు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
పాసుపుస్తకాల కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతులు
జిల్లా ఆర్డీవో వాసుచంద్ర సంఘటన స్థలానికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. గ్రామంలోని సర్వేనంబర్ 610 నుంచి 637 వరకు వివాదాస్పదమైన భూములు ఉండడంతో రెవెన్యూ అధికారులు పాసు పుస్తకాలు మంజూరు చేయడం లేదు. అధికారులు స్పందించి తమకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు.