వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను రైతు సంఘం నాయకులు సందర్శించారు. పల్లి, పసుపు, మిర్చి యార్డును పరిశీలించారు. మార్కెట్ యార్డుల్లో నెలకొన్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఉత్పత్తులకు దక్కుతున్న ధరలపై రైతు సంఘం నేతలు ఆరా తీశారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో... రైతులు అప్పుల పాలవుతున్నారు' - మార్కెట్ యార్డులు
మార్కెట్ యార్డులలో ప్రస్తుతం వస్తున్న ధరలు రైతులకు ఏమాత్రం ఆశాజనకంగా లేవని రైతు సంఘం నాయకులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు అప్పులు మూటగట్టుకుంటున్నారని ఆరోపించారు.
'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో... రైతులు అప్పుల పాలవుతున్నారు'
వ్యాపారులు ధరలు క్రమంగా తగ్గిస్తున్నారని అన్నదాతలు వాపోయారు. ప్రస్తుత ధరలు తమకు ఏమాత్రం సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు అప్పులను మూటగట్టుకుంటున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపించారు. మిర్చికి 18వేల రూపాయల మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:పగిలిన మిషన్‌భగీరథ పైప్‌లైన్... కొట్టుకుపోయిన ధాన్యం