హనుమకొండ జిల్లా దేవన్నపేటలో అన్నదాతలు మరోసారి(TRS Vijaya Garjana Sabha) ఆందోళనకు దిగారు. ఈనెల 29న తెరాస నిర్వహించే విజయగర్జన సభకు ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలో సభాస్థలి నిర్వహణ స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన అధికారులతో గొడవకు దిగారు. పంటలు పండే భూములను ఇవ్వబోమని.. అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోవాలని ధర్నాకు(TRS Vijaya Garjana Sabha) దిగడంతో వారు వెనుతిరిగారు.
గత రెండు మూడురోజులుగా వరంగల్ విజయగర్జన(TRS Vijaya Garjana Sabha) సభ కోసం ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ మంత్రి కడియం శ్రీహరి సహా పలువురు నేతలు మూమునూర్, రాంపూర్, దేవన్నపేటలోని ఖాళీ ప్రదేశాలు పరిశీలించారు. ఇటీవలే వారు దేవన్నపేటకు వెళ్లగా తెరాస నేతల(TRS Vijaya Garjana Sabha) తో రైతులు వాగ్వావాదానికి దిగారు. పంట పండే భూములను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఈరోజు కూడా నాయకులు రాగా.. వారితో మళ్లీ వాగ్వాదానికి దిగారు.