ప్రజా సమస్యలు తీర్చాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరుతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తేలా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో పాటు ఐదు డివిజన్ కార్పొరేటర్.. వరంగల్ నగరంలోని కొత్తవాడ శ్మశాన వాటిక స్థలాన్ని కాజేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
శ్మశాన వాటిక స్థలాన్ని కాజేస్తారా?: కొండా సురేఖ - trs leaders land scam in warangal town
వరంగల్ నగరంలోని కొత్తవాడ శ్మశాన వాటికను రెండుగా చీల్చి అభివృద్ధి పేరుతో తెరాస నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
భూకబ్జాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు