తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరుబావి మూసెయ్యాలని రైతు ఆత్మహత్యాయత్నం - KEROSENE CAN

అతనో రైతు.. అతని వ్యవసాయ క్షేత్రం పక్కనే మరొకరు బోరు వేశారు. అప్పటి నుంచి ఇతని బావి ఎండిపోయింది. న్యాయం చేయాలంటూ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదు. చివరకు ఏం చేయాలో తెలియక తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

మరో రైతు వేసిన బోరుబావిని తొలగించాలని రాజేశ్వర్ రావు ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 15, 2019, 6:00 PM IST

నిబంధనలకు విరుద్ధంగా తన వ్యవసాయ బావి పక్కనే మరో రైతు వేసిన బోరుబావిని తొలగించాలని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వరంగల్ అర్బన్ కాజీపేట్ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వర్​రావు అనే రైతు కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి విఫలయత్నం చేశాడు.

వ్యవసాయ బావి పక్కనే బోరు

రాజేశ్వర్​రావు వ్యవసాయ బావికి సమీపంలోనే మరో రైతు బోరు వేయడంతో తన బావిలో నీరంతా ఇంకిపోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. స్థానికులు అడ్డుకొని కిరోసిన్ క్యాన్ లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి బోరుబావిని మూయించాలని రాజేశ్వర్​రావు కోరుతున్నాడు.

తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతు

ఇవీ చదవండి :కార్ల మంటలు ఆపేదెలా?


ABOUT THE AUTHOR

...view details