Fake Rank Card NIT Warangal Admission :డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్.. ఏ కోర్సులైనా పూర్తి చేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఆ తర్వాత సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచిసర్టిఫికెట్ వస్తుంది. ఇవన్నీ లేకుండానే కోర్సును బట్టి డబ్బులు తీసుకుని నకిలీ ధ్రువపత్రాలను చేతిలో పెడుతున్నాయి కొన్ని ముఠాలు. అలాంటి అక్రమార్కులను పట్టుకోవడానికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొత్త ముఠాలు పుట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల కాలంలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి.. చేసే మోసాలు పెరిగిపోతున్నాయి.
Warangal NIT Fake Admission Issue :తాజాగా వరంగల్ నిట్లోకి నకిలీ ర్యాంక్ కార్డు(Fake Rank Card)తో సీట్ పొందేందుకు ఓ విద్యార్థిని యత్నించడం కలకలం రేపుతోంది. అధికారుల తనిఖీల్లో.. ఆ యువతి నకిలీ ర్యాంక్ కార్డు ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రకు చెందిన యువతి మంచి ర్యాంకు రాకున్నా.. వచ్చినట్లుగానకిలీ కార్డు సృష్టించుకుని.. నిట్లో ప్రవేశం పొందేందుకు యత్నించింది. విద్యార్థిని ర్యాంక్ కార్డు, నిట్ అలాట్ మెంట్ పత్రాలు(NIT Allotment Documents) నకిలీవిగా అధికారుల తనిఖీల్లో గుర్తించారు.
పైసలిస్తే.. కోరుకున్న సర్టిఫికేట్.. నకిలీ ధ్రువపత్రాల ముఠా గుట్టురట్టు
Warangal NIT Admission Issue :యువతికి 5 లక్షల ర్యాంకు వస్తే.. దానిని 50 వేలుగా మార్చుకుని ప్రవేశం పొందేందుకు సిద్ధమైంది. నిట్ అధికారుల విచారణలో.. విద్యార్థిని పత్రాలను ఫోర్జరీ చేసినట్లుగా అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. రూర్కెలాలో కూడా ముగ్గురు విద్యార్ధులు.. ఇదే తరహాలో సీటు పొందేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న కుంభకోణంగా తెలుస్తోంది.