వరంగల్ మహానగర పాలక సంస్థ నామినేషన్ల పరిశీలన సోమవారంతో ముగిసింది. 66 డివిజన్లకు గానూ మొత్తం 1,765 నామినేషన్లు వచ్చాయి. అందులో 55 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం 1,066 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. 1,710 నామినేషన్లు దాఖలు చేశారు.
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో ముగిసిన నామినేషన్ల పరిశీలన - Greater Warangal latest news
వరంగల్ మహానగర పాలక సంస్థ నామినేషన్ల పరిశీలన ముగిసింది. 66 డివిజన్లకు గానూ 1,066 మంది అభ్యర్థులు బరిలో నిలివగా.. 1,710 నామినేషన్లు దాఖలు చేశారు.
గ్రేటర్ వరంగల్ ఎన్నికలు
అందులో భాజపా 286, సీపీఐ 7, సీపీఎం 12, కాంగ్రెస్ 240, ఎంఐఎం ఒక స్థానంలో నామినేషన్ దాఖలు చేయగా.. తెరాస నుంచి 66 డివిజన్లకు గానూ 688 అభ్యర్థులు బరిలో నిలిచారు. తెదేపా 19, వైఎస్సార్సీపీ 2, స్వతంత్రులు 410, ఇతర పార్టీల నుంచి 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు వివరించారు.
ఇదీ చూడండి: మినీ పోల్స్: గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో నామినేషన్లకు చివరి రోజు