తెలంగాణ

telangana

ETV Bharat / state

జూన్​ 28 నాటికి సిద్ధం కానున్న పీవీ మ్యూజియం - శతజయంతి ఉత్సవాల నాటికి...

వరంగల్​ అర్బన్​ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మ్యూజియం సిద్ధమవుతోంది. పీవీ సొంత ఇల్లునే మ్యూజియంగా తీర్చిదిద్దుతుండగా... మహా నేత వాడిన పలు వస్తులను ఇందులో భద్రపర్చనున్నారు.

EX PRIME MINISTER PV NARSIMHA RAO HOUSE BECOMING AS MUSEUM
EX PRIME MINISTER PV NARSIMHA RAO HOUSE BECOMING AS MUSEUM

By

Published : Mar 3, 2020, 3:46 PM IST

భారత మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు పుట్టిపెరిగిన ఇల్లు ఇప్పుడు మ్యూజియంగా మారబోతోంది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని ఆయన నివాసంలో ఈ మేరకు పనులు జరుగుతున్నాయి. పీవీ అమితంగా ఇష్టపడే మహాత్ముడి విగ్రహంతోపాటు వినియోగించిన కుర్చీ, చూసిన టెలివిజన్, పీఎంగా పీవీ అందుకున్న జ్ఞాపికలను ప్రదర్శనశాలలో భద్రపర్చునున్నారు.

శతజయంతి ఉత్సవాల నాటికి...

మ్యూజియం కోసం 2 అంతస్తుల్లో 5 గదులను సిద్ధం చేస్తున్నారు. దిల్లీలో ఉన్న పలు వస్తువులను పీవీ మరణానంతరం హైదరాబాద్​లో భద్రపరిచారు. ఇప్పుడు ప్రదర్శనశాల ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వంగరకు తరలించారు. తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇంటిని మ్యూజియంగా మారుస్తున్నట్లు పీవీ తనయుడు ప్రభాకర్ రావు తెలిపారు. ఈ ఏడాది జూన్ 28 న పీవీ శతజయంతి నాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

జూన్​ 28 నాటికి సిద్ధం కానున్న పీవీ మ్యూజియం

ఇదీ చూడండి:కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details