కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రానున్నందున వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో వరంగల్ తూర్పు నియోజక వర్గ కాంగ్రెస్ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు.
'పార్టీ మారను... కార్యకర్తలకు అండగా ఉంటా' - warangal latest news
కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హామీ ఇచ్చారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.
'పార్టీ మారను... కార్యకర్తలకు అండగా ఉంటా'
కార్యకర్తలు అధైర్య పడొద్దని... తాను అండగా ఉంటానని కొండా మురళి హామీ ఇచ్చారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కేసీఆర్ మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి:నివర్ తుపాను: 3 రాష్ట్రాలకు 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు