తెలంగాణ

telangana

ETV Bharat / state

ETELA RAJENDER: 'మంత్రి హరీశ్​కు కూడా నాకు పట్టిన గతే పడుతుంది' - telangana varthalu

సీఎం కేసీఆర్​ మెప్పు పొందాలని మంత్రి హరీశ్​రావు చూస్తున్నారని... కానీ ఆయన మెప్పు పొందలేరని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ అన్నారు. మంత్రి హరీశ్​కు కూడా తనకు పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజూరాబాద్​లో తెరాసకు డిపాజిట్ దక్కదని హెచ్చరించారు. పోలీసులు చట్టానికి ధర్మానికి లోబడి పనిచేస్తున్నారా.. చుట్టానికి లోబడి పనిచేస్తున్నారా అని ఈటల నిలదీశారు.

ETELA RAJENDER:  'మంత్రి హరీశ్​కు కూడా నాకు పట్టిన గతే పడుతుంది'
ETELA RAJENDER: 'మంత్రి హరీశ్​కు కూడా నాకు పట్టిన గతే పడుతుంది'

By

Published : Jul 6, 2021, 10:33 PM IST

ETELA RAJENDER: 'మంత్రి హరీశ్​కు కూడా నాకు పట్టిన గతే పడుతుంది'

మంత్రి హరీశ్​ రావుపై మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులనూ హెచ్చరించారు. కేసీఆర్ మెప్పు పొందేందుకు అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా డిపాజిట్ దక్కదని హెచ్చరించారు. మంత్రి హరీశ్​రావు కేసీఆర్‌ మెప్పు పొందాలని చూస్తున్నారని.. ఆయన మెప్పు పొందలేరని వ్యాఖ్యానించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్​లో జరిగిన భాజపా కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు.

తెరాసలో హరీశ్​రావుకు చివరకు తనకు పట్టిన గతే పడుతుందని జోస్యం ఈటల చెప్పారు. హరీశ్​ రావు ఇక్కడి మందిని గెస్ట్‌హౌస్​కు తీసుకుపోవడం దావత్ ఇయ్యడం.. డబ్బులు ఇయ్యడం.. ఇదే పని చేస్తున్నారని ఈటల విమర్శలు గుప్పించారు. తాను వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఉండగా సీఎం కేసీఆర్ కుట్రలు చేశారన్నారు. పోలీసులు కూడా బానిసలుగా మారి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసులు చట్టానికి ధర్మానికి లోబడి పనిచేస్తున్నారా.. చుట్టానికి లోబడి పనిచేస్తున్నారా అని నిలదీశారు.

ఎన్నిరకాలుగా బెదిరించినా తాను గెలవడం ఖాయమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ వైపు చూస్తున్నారని, డబ్బు, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజూరాబాద్ ప్రజలకు ఉందన్నారు. తమ వైపు తిరిగే యువకులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రతి ఒక్కరిని బెదిరించి తెరాస కండువాలు కప్పుతున్నారని ఈటల ఆరోపించారు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా, భాజపా కార్యకర్తలను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోబోమని ఈటల హెచ్చరించారు. ఏ రోజైనా హుజూరాబాద్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చారా? అని ప్రశ్నించిన ఈటల.. మంత్రులు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిస్తున్నారని విమర్శించారు. ‘కొంతమంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉండవచ్చు… కానీ ఇంత ఘోరంగా ఉంటారా..? మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి… రేపు మీ నియోజకవర్గంలో మీ పరిస్థితి ఇంతే అవుతుందని ఈటల విమర్శించారు.

ఎన్నటికీ మెప్పు పొందలేవు..

"పోయేది భాజపా కాదు.. పోయేది కాషాయజెండా కాదు.. పోయేది పువ్వు గుర్తు కాదు... కూలిపోయేది మీ ప్రభుత్వమని గుర్తుంచుకో. సిద్దిపేట మంత్రి రోజు జనాన్ని తీసుకుపోతండు... అక్కడ పైసలు, దావత్​ ఇయ్యడం ఇదే పని చేస్తున్నరు. నువ్వు అనుకుంటున్నావు మెప్పు పొందుతున్న అని... కానీ ఎన్నటికీ మెప్పు పొందలేవు. నాకు ఏ బాధ కలిగిందో.. నీకు కూడా అదే బాధ కలుగుతుంది తప్పా.. నీకు మంచి జరిగే ప్రసక్తి లేదు. పోలీసులు చట్టానికి లోబడి పనిచేయకుండా, కార్యకర్తలను ఇబ్బందిపెడితే చూస్తూ ఊరుకోబోం. ఎన్నికుట్రలు కుతంత్రాలు చేసినా డిపాజిట్ దక్కదు.

-ఈటల రాజేందర్​, మాజీ మంత్రి, భాజపా నేత

ఇదీ చదవండి:Harish Rao: ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంజీర నీరందిస్తాం: హరీశ్​ రావు

ABOUT THE AUTHOR

...view details