వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తిలో నిర్మించతలపెట్టిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ ఏర్పాటులో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. వీటి నిర్మాణానికి ప్రభుత్వం గతంలోనే అనుమతించినా.... సాంకేతిక కారణాలు దృష్ట్యా పనులు నిలిచిపోయాయి.
పాఠశాలల ఏర్పాటుకు కృషి చేస్తా: కడియం శ్రీహరి - EX DY CM KADIYAM ON HYDERABAD PUBLIC SCHOOL IN WARANGAL
వరంగల్ అర్బన్ జిల్లాలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయటంలో తలెత్తిన సమస్యల పరిష్కారానకి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.
పాఠశాలల ఏర్పాటులో కృషి చేస్తా: కడియం శ్రీహరి
దీనిపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇతర అధికారులతో చర్చించిన ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సైనిక్ స్కూల్ భవనాల నిర్మాణానికి అనుమతివ్వాలని కేసీఆర్ను కోరనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చూడండి: దిశ కేసు: నిందితులు వాడిన లారీ దృశ్యాలు విడుదల