హుజూర్నగర్ ఫలితాలతోనైనా ప్రతిపక్షాల తమ వైఖరి మార్చుకుని సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని పరిశీలించాలని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని చిన్న పెండ్యాలలో ఆయన పర్యటించారు. గ్రామంలోని మల్లంగుంట చెరువును సందర్శించి దేవాదుల నీటితో దాన్ని నింపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ప్రజలు తెరాస అభ్యర్థిని గెలిపించడం అభినందనీయమన్నారు.
'హుజూర్నగర్లో తెరాస గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు'
హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సైదిరెడ్డి విజయం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని మాజీ ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇప్పటికైనా తీరుమార్చుకోకపోతే ప్రతిపక్షాలకు భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు.
'హుజూర్నగర్లో తెరాస గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టు'