రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై కొన్ని ఛానళ్లలో భూకబ్జా పేరిట అసత్య ప్రచారం చేస్తున్నారంటూ శుక్రవారం రాత్రి వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ బస్టాండ్ కూడలిలో ఆయన అభిమానులు ఆందోళన చేశారు. ఉద్యమ బిడ్డ ఈటలపై అసత్య ఆరోపణలు తగదని నినదించారు.
మంత్రి ఈటలకు మద్దతుగా అభిమానుల ఆందోళన - ఈటల రాజేందర్‌పై భూ కబ్జా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో మంత్రి ఈటల అభిమానులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. ఈటలపై భూ కబ్జా పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లలో వార్తల ప్రసారంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్-పరకాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
హుజూరాబాద్ డిపోకు చెందిన బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. వారిని ఎస్సై జె.పరమేశ్ ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెరాస మండలాధ్యక్షుడు మాట్ల రమేశ్, పట్టణ శాఖ అధ్యక్షుడు మౌటం సంపత్, రై.బ.స. కన్వీనర్ సమ్మిరెడ్డి, టీఆర్‌ఎస్వీ మండలాధ్యక్షుడు కె.రాజ్‌కుమార్, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి :మంత్రి ఈటల భవిష్యత్తుపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చలు!