తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్, బండి జైలుకు వెళ్లాల్సిందే: ఎర్రబెల్లి - ఎర్రబెల్లి కామెంట్స్

Errabelli spoke about Revanth Reddy and Bandi Sanjay: రాష్త్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టీఎస్​పీఎస్సీ కేసు సిట్ దర్యాప్తు చేస్తోంది. దీనిలో భాగంగానేల పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​లకి నోటీసులు జారీ చేసింది. వారు చేసిన ఆరోపణలు నిరూపించకోకపోతే జైలుకి వెళ్తారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.

Minister Errabelli opening the super market
సూపర మార్కెట్​ను ప్రారంభిస్తున్న మంత్రి ఎర్రబెల్లి

By

Published : Mar 24, 2023, 10:01 PM IST

Errabelli spoke about Revanth Reddy and Bandi Sanjay: టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నిరూపించకపోతే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ త్వరలో జైల్​కు వెళ్తారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటీఆర్​లపై చేసిన వాఖ్యలు నిరుపించకపోతే రాహుల్ గాంధీలా బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు జైల్ శిక్షకు అర్హులుగా ఆయన పరిగణించారు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో నందనం ఎఫ్​ఎస్​సీఎస్​ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్​ను ప్రారంభోత్సవంలో మంత్రి ఈ వాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు రోజురోజుకు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులకు అసత్య ఆరోపణలతో ముప్పు పొంచి ఉందని జోష్యం చెప్పారు.

రేవంత్​రెడ్డికి సిట్​ నోటీసులు: టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజ్ కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది.. ఇక ఈ పేపర్ లీకేజీపై ఆరోపణలు చేస్తోన్న వారికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి 20వ తేదీన నోటీసులు ఇచ్చారు. దీనిపై రేవంత్​రెడ్డి స్పందించి తనకు నోటీసులు అందలేదని తెలిపారు. సిట్ ఇచ్చిన నోటీసులో ఆయన ఆరోపించిన వాటిని తమకు ఇవ్వాలని కోరింది. గ్రూప్‌- 1లో కొంత మంది అభ్యర్ఖులకు 100కు పైగా ర్యాంకులు వచ్చాయని ఆయన ఆరోపించారు. ఒకే మండలంలో 100 మందికి పైగా మంచి ర్యాంకులు వచ్చాయని ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు చేసినందునే రేవంత్​ రెడ్డికి సిట్​ నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులు తనకు ఇంకా అందలేదని తెలిపారు. సిట్ నోటీసులకు భయపడేది లేదని చెప్పారు.

బండి​కి సిట్​ నోటీసులు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమవుతున్న టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజ్​ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో సిట్​ తనకి కూడా నోటీసులు జారీ చేసింది. తన దగ్గర ఉన్న సమాచారాన్ని అందించాల్సిందిగా డిమాండ్​ చేసింది. దీనిపై ఆయన​ స్పందించారు. తనకు ఎటువంటి సిట్ నోటీసులు అందలేదని చెప్పారు. ఎవరి ఇంటికి అంటించారో తెలియదని అన్నారు. తాను ఇంటికి వెళ్లేసరికి చిరిగిపోయిన కాగితం ఉందని చెప్పారు. సిట్‌ నోటీసులు తనకు కాదు ఇవ్వాల్సింది.. ముఖ్యమంత్రికి, తన కుమారుడికి ఇవ్వాలని వెల్లడించారు.

ఇవీ చదవండ:

ABOUT THE AUTHOR

...view details