కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై.. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తెలంగాణకి అన్యాయం చేయడం కేంద్రంలో భాజపాకు అలవాటుగా మారిందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు లాగే, కాజీపేట రైల్ కోచ్ ప్రాజెక్టుకి భాజపా మంగళం పాడిందని ఎద్దేవా చేశారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ అంశంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఆ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేస్తామని పేర్కొన్నారు.
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి
కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుమార్లు కేంద్రాన్ని సీఎం కేసీఆర్ కోరారని.. అయినా స్పందించలేదని ఆరోపించారు. కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగ బద్ధమైన హక్కుగా చెప్పారు. వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక అని.. దాని కోసం ఉద్యమిస్తామని తెలిపారు. ప్రజల మద్దతుతో కేంద్రాన్ని, భాజపాని నిలదీయనున్ననట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి :తెరాసకు ఓటు వేస్తే చెప్పుకు వేసినట్లే: బండి సంజయ్