వరంగల్ అర్బన్ జిల్లా దర్గాకాజీపేట్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్ధి భానుకిరణ్ తల్లిదండ్రులను కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 26 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఆ కుటుంబాలను పరామర్శించే ప్రయత్నం కూడా తెరాస నాయకులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
'ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి'
ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల వల్లే విద్యార్థులు తనువు చాలించారని భాజపా నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఆరోపించారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి : దత్తాత్రేయ