ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటారని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం ఆశయాన్ని వమ్ము చేయకుండా బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో పాటుపడతామని పేర్కొన్నారు.
'సీఎం కేసీఆర్కు ఉద్యోగులు రుణపడి ఉంటారు' - Warangal Urban District Latest News
వరంగల్లో ఉద్యోగుల సంబురాలు చేసుకున్నారు. ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించటంతో ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు తినిపించుకున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు పాలాభిషేకం
ఉద్యోగులకు కేసీఆర్ 30 శాతం పీఆర్సీ ప్రకటించటంతో వరంగల్లో సంబురాలు చేసుకున్నారు. హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఎన్జీఓ, టీజీవో ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుకున్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిసి స్వీటు తినిపించారు.
ఇదీ చూడండి:'అమరులను స్మరించుకునేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్'