వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ని వ్యతిరేఖిస్తూ.. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్టు కార్మికులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. విద్యుత్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి హన్మకొండలోని విద్యుత్ భవన్ ముందు నిరసన చేపట్టారు.
హన్మకొండలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన - వరంగల్ అర్బన్ జిల్లా
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020 వెంటనే నిలిపి వేయాలని వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండలోని విద్యుత్ భవన్ ముందు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.
హన్మకొండలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.. నినాదాలు చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించడం.. దోపిడికి దారులు వేసినట్టే అని ఆరోపించారు. విద్యుత్ సవరణ బిల్లు వల్ల పేదలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోకపోతే.. ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి:విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా