వచ్చే ఏడాది బతుకమ్మ పండగ వరకు కరోనా మాయం కావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆకాంక్షించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను, ఆటలను తిలకించారు. నాయకులతో మాట్లాడారు. వేడుకలకు చేసిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
'వచ్చే ఏడాది బతుకమ్మ పండగ వరకు కరోనా మాయం' - eetala rajendar latest
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా వేడుకలను గుంపులు గుంపులుగా జరుపుకోవద్దని సూచించారు. కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు.
'వచ్చే ఏడాది బతుకమ్మ పండగ వరకు కరోనా మాయం'
కరోనా ఇప్పటికే కంటి మీద కునుకులేకుండా చేసిందన్నారు. బతుకమ్మ, దసరా వేడుకలను ప్రజలు గుంపులుగా జరుపుకోవద్దని ప్రభుత్వం సూచించిందన్నారు. పండగలు, పెళ్లిళ్లు నిరాడంబరంగా జరుపుకుంటున్నామని గుర్తుచేశారు. కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని కోరారు. కరోనా కట్టడికి మంచి వ్యాక్సిన్ రావాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'కేసీఆర్ నియంతృత్వ పోకడలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు'